TDP leader Yanamala: జగన్ రెడ్డి మాటలు నేతి బీరకాయలో నెయ్యి చందంలా ఉన్నాయని తెదేపా నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. జగన్ రెడ్డికి ప్రచారం చేసుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యల పరిష్కరించడంపై లేదన్నారు. సామాజిక న్యాయం, సమసమాజ, నవ సమాజ స్థాపనలపై జగన్ రెడ్డికి చిత్తశుద్ది లేదని యనమల మండిపడ్డారు. జగన్ చేస్తున్న సామాజిక న్యాయం కంటే ఆయన చేసిన సామాజిక అన్యాయమే ఎక్కువ అని యనమల అభిప్రాయపడ్డారు. సంక్షేమ పథకాల్లో నిబంధనలు పెట్టి లక్షల మందిని తొలంగించారని రామకృష్ణుడు ఆరోపించారు. దళితులు, గిరిజనులు, బీసీలపై దాడులు, హత్యలు చేయించారన్నారు. జగన్ రెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా సంక్షేమంలో పెట్టిన కోతలపై శ్వేతపత్రం విడుదల చేయాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: