ETV Bharat / city

YANAMALA: మంత్రివర్గం చేసిన తప్పిదాలకు ఉద్యోగులకు శిక్ష వేస్తారా..?

రాష్ట్ర ఆర్థిక లోపాలకు మంత్రివర్గమే దోషి అని.. మాజీ ఆర్థికమంత్రి తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఆర్థిక అవకతవకల వాస్తవాలను దాచిన మంత్రివర్గం.. అమాయక అధికారుల్ని శిక్షించటం ఎంతవరకు సబబని నిలదీశారు. శాసనసభ, కాగ్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలకు..రాష్ట్ర ఆర్థిక విషయాలను వెల్లడించకుండా ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు.

YANAMALA
మంత్రివర్గం చేసిన తప్పిదాలకు ఉద్యోగులకు శిక్ష వేస్తారా
author img

By

Published : Aug 6, 2021, 5:06 AM IST

రాష్ట్ర ఆర్థిక శాఖలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై యనమల రామకృష్ణుడు 5 పేజీల ప్రకటన విడుదల చేశారు. మంత్రివర్గం చేసిన తప్పిదాలకు ఉద్యోగులను బాద్యులను చేసి శిక్ష వేయడాన్ని ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులకు మంత్రివరం ట్రస్టీలే తప్ప యజమానులు కాదనే విషయం గుర్తించాలన్నారు. ప్రజాధనం ఖర్చు చేసేందుకు నిబంధనలుంటాయని.. నిధుల్ని ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు చేస్తే వాస్తవాలు బహిర్గతం చేసేందుకు భయమెందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖర్చుల్లో పారదర్శకత లేకపోవటం వల్లే రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందన్నారు.

రుణ సంక్షోభానికి తెదేపా ప్రభుత్వం చేసిన అప్పులే కారణమన్న ఆర్థికమంత్రి బుగ్గన వ్యాఖ్యలను యనమల కొట్టిపడేశారు. ముఖ్యమంత్రి, సహచర మంత్రుల అవినీతి, దుబారా కారణంగానే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందని ఆక్షేపించారు. తెలుగుదేశం పాలనలో రూ. లక్షా 30వేల కోట్ల అప్పు చేస్తే వైకాపా ప్రభుత్వం 25 నెలల్లోనే రూ. లక్షా 49 వేల కోట్ల అప్పు చేసిందన్నారు. కార్పొరేషన్ల ద్వారా మరో రూ. 34,650 కోట్లు రుణాలు సమీకరించారని వెల్లడించారు. తెలుగుదేశం పాలనలో ఏటా సగటున 26వేలకోట్ల రుణాలు తీసుకుంటే.. జగన్‌ ప్రభుత్వం సంవత్సరానికి 50 వేల కోట్లు అప్పు చేయటంతో పాటు ఆఫ్‌-బడ్జెట్‌ రుణాల రూపేణా మరో 34వేల కోట్లు సమీకరించిందని యనమల వివరించారు. ఈ నిధులన్నీ ఉత్పాదక కార్యక్రమాల కోసం ఖర్చు చేయలేదన్న యనమల.. వైకాపా పాలనలో ఎక్కడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని మండిపడ్డారు.

2019-20లో 57 రోజులు ఓవర్‌ డ్రాఫ్ట్‌కు వెళ్లారన్న యనమల..స్పెషల్‌ విత్‌డ్రాల కోసం 37 రోజులు, వేతనాల కోసం 128 రోజులు.. మొత్తంగా ఏడాదిలో 221 రోజులు అప్పులకు వెళ్లారని పేర్కొన్నారు. ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకే ప్రతి సమాచారాన్ని పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టే విధానాన్ని తెలుగుదేశం అమలు చేసిందని.. అలాంటి సమాచారం లీక్‌ చేయాల్సిన ఉవసరం ఉద్యోగులకు ఉండదని అభిప్రాయపడ్డారు. సమాచారం బయటకొచ్చిందని ఉద్యోగులపై అక్కసు వెళ్లగక్కటం నీతిబాహ్య చర్యని అన్నారు. అమరరాజా కర్మాగారం తరలింపు వార్తలపై స్పందించిన యనమల ఆ ఒక్క సంస్థ వల్లే రాష్ట్రానికి జీఎస్టీ ద్వారా రూ. 12 వందల కోట్లు ఆదాయం వస్తోందన్నారు. భారతి సిమెంటు కర్మాగారం, అరబిందో ఫార్మాతో ఎక్కువగా కాలుష్య సమస్య ఉంది తప్ప.. అమరరాజా ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం వస్తోందని స్థానికుల నుంచి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదన్నారు.

ఇదీ చదవండి:

HIGH COURT: జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల అప్పీల్​పై తీర్పు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.