ETV Bharat / city

పరిషత్​ ఎన్నికలపై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు సంతృప్తిగా లేదు: వర్ల రామయ్య - mptc, zptc elections in andhrapradhesh

పరిషత్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్​కు వెళ్తున్నట్లు తెదేపా నేత వర్ల రామయ్య తెలిపారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

tdp leader varla ramayya
తెదేపా నేత వర్ల రామయ్య
author img

By

Published : Apr 7, 2021, 6:14 PM IST

తెదేపా నేత వర్ల రామయ్య

పరిషత్ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తెలుగుదేశం తరఫున సుప్రీంకోర్టులో అప్పీల్​కు వెళ్తున్నట్లు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలిపారు. డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు సంతృప్తికరంగా లేనందునే, సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘన జరిగిందనే విషయాన్ని వివరిస్తూ అప్పీల్​కు వెళ్లాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

వైకాపా ప్రభుత్వం అప్రజాస్వామికంగా వెళ్తుంటే చూస్తూ ఊరుకోమన్న వర్ల రామయ్య.. నోటిఫికేషన్​కు నాలుగు వారాల వ్యవధి ఉండాలనే నిబంధనను ఎన్నికల సంఘం ఉల్లంఘించిందని ఆరోపించారు. తెదేపా అధినేత చంద్రబాబు.. పార్టీ ముఖ్య నేతలందరితో సమావేశం నిర్వహించిన అనంతరమే సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్లు వర్ల రామయ్య చెప్పారు. వైకాపా ప్రభుత్వంపై ఎంతవరకైనా పోరాడతామని స్పష్టం చేశారు.

ఇదీచదవండి.
'సమస్యలపై పోరాడే పనబాక లక్ష్మికి ఓటు వేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.