ETV Bharat / city

Varla Ramaiah Letter to DGP: పోలీసు అధికారులపై దాడులు చేసిన వారిని శిక్షించాలి.. డీజీపీకి వర్ల రామయ్య లేఖ - డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి వర్ల రామయ్య లేఖ

Varla Ramaiah letter to DGP: పోలీసు అధికారుల్లో ఆత్మస్థైర్యం నింపేలా.. వారిపై దాడులు చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని.. తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డికి లేఖ రాశారు.

TDP leader Varla Ramaiah letter to DGP Rajendranath reddy
డీజీపీకి వర్ల రామయ్య లేఖ
author img

By

Published : Feb 23, 2022, 9:22 AM IST

Varla Ramaiah letter to DGP: పోలీసు అధికారుల్లో ఆత్మస్థైర్యం నింపేలా.. వారిపై దాడులు చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డికి తెదేపా పోలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. వైకాపా అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి.. ఆ పార్టీ నాయకులు అహంకారంతో ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు అధికారులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వైకాపా నాయకులు చేసిన ఆగడాలు, అరాచకాలు, అఘాయిత్యాలు అనేకం ఉన్నాయన్నారు.

పోలీసు శాఖ చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా రాజ్యాంగాన్ని అనుసరించి విధులు నిర్వహించడం లేదనే అపవాదు ఉందన్నారు. పోలీసు శాఖాధిపతిగా ఆ శాఖలో ఆత్మస్థైర్యాన్ని నింపేలా.. నేరం చేసినవారు ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని రాజకీయ పార్టీల వారిని సమదృష్టితో చూడాలని వర్ల రామయ్య డీజీపీని కోరారు.

ఇదీ చదవండి:

Award to APSRTC: ఏపీఎస్ఆర్టీసీకి నాలుగోసారి డిజిటల్ టెక్నాలజీ సభ పురస్కారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.