ETV Bharat / city

'యువతను కించపరిచేలా మాట్లాడిన అధికారులపై చర్యలు తీసుకోండి' - సీఐడి అధికారి సునీల్ కుమార్, అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబులపై చర్యలకు వర్ల డిమాండ్

"ఉగ్రవాదులను ఆదర్శంగా తీసుకోవాలని ఎస్సీ యువతను ప్రోత్సహిస్తున్న సీఐడీ అధికారి సునీల్ కుమార్, కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబులపై క్రిమినల్ చర్య తీసుకోవాలి" అని తెదేపా నేత వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు.

varla ramaiah letter to central home ministry secretary
కేంద్ర హోంశాఖకు వర్ల రామయ్య ఫిర్యాదు
author img

By

Published : Jun 27, 2021, 12:38 PM IST

సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్, కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబుపై... కేంద్ర హోంశాఖకు తెలుగుదేశం నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఉగ్రవాదులను ఆదర్శంగా తీసుకోవాలని ఎస్సీ యువతను ప్రోత్సహిస్తున్నారంటూ... కేంద్ర హోంశాఖ కార్యదర్శి, డీపీటీ కార్యదర్శికి విడివిడిగా లేఖలు రాశారు. వీరిద్దరిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ సవాంగ్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు.

సునీల్‌ కుమార్‌ ఏర్పాటుచేసిన ఏఐఎం సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో భారతీయ సంస్కృతిని కించపరిచేలా మాట్లాడారని వర్ల రామయ్య ఆరోపించారు. సివిల్ కాండక్ట్ రూల్స్‌ను ఉల్లంఘించిన ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వారిపై రాజద్రోహం నేరం కింద క్రిమినల్​ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

'ఐదింటికల్లా అన్నీ బంద్ చేయండి.. ఆరింటికల్లా ఇంటికి చేరండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.