రాష్ట్రంలో దళితులకు, మహిళలకు, యువతులకు రక్షణ లేకుండా పోయిందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్లరామయ్య అన్నారు. విజయవాడలో దళిత యువతి హత్యకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. నేరగాళ్లకు అండగా, బాసటగా ప్రభుత్వం నిలుస్తోందని ఆరోపించారు. నేరగాళ్లకు పోలీసులన్నా, ప్రభుత్వమన్నా భయం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రేమ అనే ముసుగులో యువతి బలైపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
ముఖ్యమంత్రి జగన్ అసమర్ధ, అన్యాయ, నీచ రాజకీయాలు పక్కన పెట్టి పాలనపై దృష్టి పెట్టాలని వర్లరామయ్య హితవు పలికారు. తప్పు చేస్తే కఠినంగా వ్యవహరించే విధంగా ప్రభుత్వం నడుచుకోవాలన్నారు. ఓ దళిత యువతి హత్యకు గురైతే దళిత హోంమంత్రి ఇంత వరకు స్పందించలేదన్న ఆయన.. ఇదేనా దళితులపై ఉన్న ప్రేమ అని ప్రశ్నించారు. దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలకు సీఎం సమాధానం చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి..