స్థానిక సంస్థల ఎన్నికల తరహాలోనే తిరుపతి ఉప ఎన్నికల్లోనూ అధికార పార్టీ వ్యవహరిస్తోందని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య ఆరోపించారు. పోలీసులు.. తిరుపతి ఓటర్లను భయపెడుతున్నారని ఆరోపించారు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి విజయానంద్‌కు ఫిర్యాదు చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో తెదేపా పోటీ చేయడం లేదని పోలీసులే ఇంటింటికి వెళ్లి ఓటర్లకు చెబుతున్నారని.. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని సీఈవోను కోరినట్లు వర్ల తెలిపారు.
తిరుపతి పోలింగ్ సందర్భంగా ఓటర్ల క్యూలైన్లను నియంత్రించే బాధ్యతలనూ కేంద్ర బలగాలకే అప్పగించాలని వర్ల అభ్యర్థించారు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో వ్యయ పరిశీలకులతో పాటు ఎన్నికల పరిశీలకులను నియమించాల్సిందిగా ఎన్నికల ముఖ్య అధికారిని కోరారు. పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు ప్రతి చోటా సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:
వైకాపా ప్రభుత్వ అరాచకానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు: చంద్రబాబు