తూర్పుగోదావరి జిల్లా యర్రంపాడులో బాలికపై వైకాపా కార్యకర్త అత్యాచారం చేస్తే పోలీసులు ఇంతవరకు చర్యలు తీసుకోలేదని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. అధికార పార్టీ అండతోనే మృగాళ్ళు రెచ్చిపోతున్నారని ఆమె ఆరోపించారు. నేతల అండతో నిందితుడు తప్పించుకునే యత్నం చేస్తున్నాడని దుయ్యబట్టారు.
వైకాపా నేతలు, కార్యకర్తలు అఘాయిత్యాలకు పాల్పడుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మహిళలపై 300కి పైగా దాడులు జరిగాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దిశ చట్టం ఎక్కడా అమలు కావట్లేదన్నారు. వాలంటీర్ల ఆగడాలకు అంతే లేకుండాపోయిందన్నారు.
ఇవీ చదవండి..