ETV Bharat / city

'ఎంపీ రఘురామపై దాడి సజ్జల కనుసన్నల్లోనే జరిగింది' - sajjala news

ఎంపీ రఘురామపై దాడిలో పాల్గొన్నవారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని తెదేపా నేత డాక్టర్ సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇదంతా సజ్జల కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు.

tdp leader fired over raghrama incident
ఎంపీ రఘరామపై దాడి సజ్జల కనుసన్నల్లోనే జరిగింది
author img

By

Published : May 23, 2021, 7:08 PM IST

రఘురామకృష్ణరాజును పోలీసుల సమక్షంలో కొట్టిన ముసుగు దొంగలు ఎవరో నిగ్గు తేల్చాలని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. దీని వెనుక ముఖ్యమంత్రి, హోం మంత్రి హస్తం ఉందన్న అనుమానం సర్వత్రా వినిపిస్తుండటంతో పాటు.. దాడి వ్యవహారం పూర్తిగా సజ్జల రామకృష్ణా రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. సజ్జలను విమర్శించారని కక్షతోనే ఇలా చేయించారంటూ మండిపడ్డారు.

సీఎం అండదండలతోనే సజ్జల, పోలీసులు కలిసి ఈ దుస్సాహసానికి పాల్పడ్డారని సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. జగన్ బెయిల్ రద్దుపై పిటిషన్ వేశారనే కోపం కూడా ఇందులో దాగి ఉందన్నారు. ఘటనపై సీబీఐ విచారణ జరిపించి.. కుట్రను బయట పెట్టాలని డిమాండ్​ చేశారు.

ఇవీ చదవండి:

షూ లేకుండా బైక్​ నడిపితే ఫైన్​-​ మీకు తెలుసా?

రాష్ట్రంలో కొవిడ్ పాజిటివిటీ రేటు తగ్గింది: ఏకే సింఘాల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.