ETV Bharat / city

Somireddy: సినీ ప్రముఖులను సీఎం జగన్​ అవమానించారు: సోమిరెడ్డి - విజయవాడ రాయకీయ వార్తలు

Somireddy on CM Jagan: సినీ ప్రముఖులను సీఎం జగన్​ అవమానించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి అన్నారు. అగ్ర హీరోలకు ప్రతి నమస్కారం పెట్టాలనే సంస్కారం కూడా లేదా? అని ప్రశ్నించారు. సినీ పరిశ్రమ జోలికి ఏ రాష్ట్ర ప్రభుత్వమూ వెళ్లలేదన్నారు. అఖిల భారత సర్వీసు అధికారులను కూడా అవమానించారని ఆరోపించారు.

Somireddy on CM Jagan
సోమిరెడ్డి చంద్రమోహన్​ రెడ్డి
author img

By

Published : Feb 16, 2022, 12:13 PM IST

Updated : Feb 16, 2022, 1:16 PM IST

సోమిరెడ్డి చంద్రమోహన్​ రెడ్డి

Somireddy on CM Jagan: సీఎం జగన్​పై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తెలుగు సినీ ప్రముఖులను ముఖ్యమంత్రి అవమానించిన తీరును తట్టుకోలేకపోతున్నానని.. సోమిరెడ్డి అన్నారు. నమస్కారం పెట్టిన అగ్రహీరోలకు ప్రతినమస్కారం పెట్టాలనే సంస్కారం... సీఎంకు లేకుండా పోయిందని విమర్శించారు. వేలాదిమంది ఆధారపడిన సినీపరిశ్రమకు... లేని సమస్య సృష్టించి... మళ్లీ తానే పరిష్కరిస్తున్నట్లు సీఎం నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

ఐఏఎస్​ను అవమానించారు...

మరోవైపు అఖిలభారత సర్వీసు అధికారుల్ని దారుణంగా అవమానించారన్నారు. ముఖ్యమంత్రికి సలామ్ కొడుతూ నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన గౌతమ్ సవాంగ్‌ను గంటలో తొలగించారన్నారు. సవాంగ్ దెబ్బతీసిన పోలీస్ ప్రతిష్టను... డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కొంతైనా కాపాడతారేమో వేచి చూడాలని... సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.

సీఎం జగన్​ను అగ్రహీరోలు కలిసిన సందర్భాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఎందుకంటే కోట్లాది మంది అభిమానులండే హీరోలను ముఖ్యమంత్రి రెసిడెన్స్​లో గేటు బయట దింపి నడిపిస్తారా...? చిరంజీవి తన చేతులతో నమస్కరించి సినీ పరిశ్రమను కాపాడండి అంటే తిరిగి సీఎం ప్రతినమస్కారం చేయరా...? దేశంలోని ఇతర రాష్ట్రాల్లో సినిమా ఇండస్ట్రీని టచ్​ చేసినవాళ్లు లేరు. హీరోలను కించపరచడం దారుణం. మరోవైపు పోలీస్​ వ్యవస్థను నిర్వీర్యం చేసేశారు.-తెదేపా పొలిట్​ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి

ఇదీ చదవండి: Controversies on Postings and Transfers : ముందు అందలం ఎక్కించి...ఆపై అవమానించి...

Last Updated : Feb 16, 2022, 1:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.