ETV Bharat / city

Somireddy: ముఖ్యమంత్రుల మనస్పర్థలకు ప్రజలు బలవుతున్నారు.. - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మనస్పర్థల కారణంగా.. ఆరు జిల్లాల ప్రజలు బలవుతున్నారని.. తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కృష్ణా జలాలపై ఉన్న హక్కుల్ని కాలరాస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమకు తాగునీరు కూడా దక్కకుండా జరిగే చర్యల్ని ఎందుకు అడ్డుకోవట్లేదో చెప్పాలని.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

tdp leader somireddy chandramohan reddy fires on ycp govt over krishna water
వైకాపా ప్రభుత్వంపై సోమిరెడ్డి ధ్వజం
author img

By

Published : Jul 30, 2021, 5:08 PM IST

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మనస్పర్థలు.. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కృష్ణా జలాలపై ఉన్న హక్కుల్ని కాలరాస్తున్నాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఇద్దరూ.. ఆరు జిల్లాల హక్కులకు భంగం కలిగేలా ఎందుకు వ్యవహరిస్తున్నారని నిలదీశారు. ఇద్దరి మధ్య కాంట్రాక్ట్ విభేదాలా, ఆర్ధిక లావాదేవీల సమస్యలా లేక షర్మిల వల్ల ఏర్పడిన దూరమా అని ప్రశ్నించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల కలహాలకు ఆరు జిల్లాల ప్రజలు బలవుతున్నారని మండిపడ్డారు. ఇదే తీరు కొనసాగితే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

శ్రీశైలం జలాశయం నిండినా పోతిరెడ్డిపాడుకు నీరు వదలొద్దని తెలంగాణ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీకృష్ణ.. కేఆర్​బీఎమ్​కు లేఖ రాయటాన్ని.. సోమిరెడ్డి తప్పుబట్టారు. నీరు సముద్రానికి పోయినా పర్లేదు కానీ సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు అందకూడదన్నట్లు.. తెలంగాణా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీవ్రంగా పరిగణించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాయలసీమకు తాగునీరు కూడా దక్కకుండా జరిగే చర్యల్ని ఎందుకు అడ్డుకోవట్లేదో.. ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఇద్దరు ముఖ్యమంత్రులు నీటి సమస్య పై చర్చించి పరిష్కారం చూపాలన్నారు. ఇద్దరూ సమస్య పరిష్కారంలో విఫలమైనందునే.. కేంద్ర పెత్తనంలోకి ప్రాజెక్టులన్నీ వెళ్లాయని మండిపడ్డారు. కేంద్రం రీ నోటిఫికేషన్ ఇచ్చేలా ఇద్దరు సీఎంలు దిల్లీ వెళ్లి తాడో పేడో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

RRR: ఆగస్టు 25న తప్పకుండా న్యాయం జరుగుతుంది: రఘురామరాజు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.