ETV Bharat / city

'ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి మోసం చేశారు'

author img

By

Published : Mar 24, 2021, 6:04 PM IST

25 మంది ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చి మోసం చేశారని.. తెదేపా అధికార ప్రతినిధి మాణిక్యాలరావు అన్నారు. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలో ఏ ముఖం పెట్టుకుని వైకాపా నేతలు ఓటు అడుగుతారని ప్రశ్నించారు.

pilli manikyalarao allegations on ycp mps
రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై వైకాపా ఎంపీల మీద పిల్లి మాణిక్యాలరావు విమర్శలు

ప్రత్యేక హోదాపై నోరు విప్పని వైకాపాకు.. తిరుపతి ఉప ఎన్నికలో ఓటు అడిగే హక్కు లేదని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు విమర్శించారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తానని హామీ ఇచ్చి.. సీఎం జగన్ మోసం చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని తిరుపతిలో ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.

కేసుల నుంచి తనను తాను రక్షించుకునేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడగాలంటే అందుకే భయపడుతున్నారని ఆరోపించారు. సీఎం వైఖరి మారకుంటే రాష్ట్ర భవిష్యత్తు తీవ్రంగా నష్టపోతుందని చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి తేవడంలో ఎందుకు విఫలమయ్యారో.. ప్రజలకు సమాధానం చెప్పాలని అధికారపార్టీ ఎంపీలను డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

ఎస్​ఈసీగా విశ్రాంత ఐఏఎస్ అధికారి శామ్యూల్ వద్దు: వర్ల

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.