తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అజ్ఞాతంలోకి వెళ్లారు. పోలీసులు మళ్లీ అరెస్టు చేస్తారనే ఉద్దేశంతో పట్టాభి అజ్ఞాతంలోకి వెళ్లారని అంటున్నారు. ముఖ్యమంత్రిని దూషించారనే ఆరోపణలతో బుధవారం అరెస్టైన ఆయన... శనివారం సాయంత్రం రాజమహేంద్రవరం కారాగారం నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. అక్కడి నుంచి విజయవాడ వస్తుండగా పొట్టిపాడు టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆయన వెంట ఉన్న వాహనాలను నిలిపేశారు. ఆ తర్వాత పట్టాభిరామ్ ఎవరికీ కనిపించలేదు.
ఇదీచదవండి.