ETV Bharat / city

రికార్డు కోసం జగన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కరోజు ఆర్భాటం చేసింది: పట్టాభి - tdp leader pattabi latest updates

రాష్ట్ర ప్రజలకు సక్రమంగా వ్యాక్సిన్లు ఇవ్వకుండా జగన్ రెడ్డి ప్రభుత్వం రికార్డు కోసం ఒక్కరోజు ఆర్భాటం చేసిందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాల్లో ఈ అయిదు రోజుల్లో రోజుకు లక్ష నుంచి 4 లక్షల వరకూ వ్యాక్సిన్లు పంపిణీ చేస్తే రాష్ట్రంలో అది పది శాతం కూడా లేదని ఆయన విమర్శించారు.

రికార్డు కోసం జగన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కరోజు ఆర్భాటం చేసింది: పట్టాభి

author img

By

Published : Jun 21, 2021, 10:18 PM IST

రాష్ట్రంలో 5 రోజుల పాటు ప్రజలకు సక్రమంగా వ్యాక్సిన్లు ఇవ్వకుండా రికార్డు కోసం ఒక్కరోజు ఆర్భాటం జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ధ్వజమెత్తారు. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ

"ఒక్క రోజులోనే 13.59లక్షల వ్యాక్సిన్లు ఇచ్చామని ప్రభుత్వం మోసకారి ప్రకటనలు చేస్తోంది. 20వ తేదీకి ముందు అయిదు రోజులు కలిపి ప్రభుత్వం ఇచ్చిన వ్యాక్సిన్లు 1.80లక్షలు మాత్రమే. 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ నామమాత్రంగా వ్యాక్సిన్లు ఇచ్చి ప్రజల్ని మోసగించారు. ఇతర రాష్ట్రాల్లో ఈ అయిదు రోజుల్లో రోజుకు లక్ష నుంచి 4లక్షల వరకూ వ్యాక్సిన్లు పంపిణీ చేస్తే రాష్ట్రంలో అది పది శాతం కూడా లేదు. రికార్డుల కోసం ఒకో రోజు జనాన్ని పోగేసి కొవిడ్ నిబంధనలు పాటించకుండా గంటల తరబడి క్యూలో నిలబెట్టారు. ఆదివారం రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్లు కలిపినా ఏపీ అనేక రాష్ట్రాలకంటే వెనుకబడి ఉంది. అత్యధికంగా మహారాష్టలో 2.76కోట్ల వ్యాక్సిన్లు ఇస్తే, యూపీలో 2.56కోట్లు, రాజస్థాన్ లో 2.12కోట్లు, గుజరాత్ 2.21కోట్లు, పశ్చిమ బంగ్లాలో 1.90కోట్లు, కర్ణాటకలో 1.84కోట్లు, మధ్యప్రదేశ్ లో 1.50కోట్లతో అనేక రాష్ట్రాలు ఏపీ కంటే ముందంజలో ఉంటే ఏపీలో వేసింది 1.39కోట్లు మాత్రమే. గడచిన వారం రోజుల్లో వ్యాక్సిన్ గ్రోత్ రేటు రాష్ట్రంలో 5.27శాతం మాత్రమే. రాష్ట్రంలో 74.15శాతం ప్రజలకు ఇప్పటికీ ఇంకా తొలి డోస్ వ్యాక్సిన్ అందలేదు. రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన వాళ్లు 80లక్షల పైనే ఉన్నారు. ఇకనైనా జిమ్మిక్కులు మాని కొవిడ్ బాధితుల్ని ఆదుకునేందుకు తెదేపా ప్రభుత్వం ముందు పెట్టిన పది అంశాలు పరిష్కరించాలి." అని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

CM Jagan: కొవిడ్ వ్యాప్తిపై మరింత అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.