జీవో నెం 55, జీవో నెం 12ల ద్వారా.. నోటు పుస్తకాల టెండర్లలో దాదాపు రూ. 100 కోట్ల విలువైన దోపిడీకి ప్రభుత్వం సిద్ధమైందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించే పుస్తకాల ముద్రణలో.. జగన్ ప్రభుత్వం కమీషన్లకు ఆశపడి, జీవోలను తుంగలోతొక్కి, ఏపీటీపీసీని కాదని పుణేలోని ప్రైవేట్ కంపెనీని ఆశ్రయించిందని ఆరోపించారు. నాణ్యమైన పుస్తకాలను అందిస్తున్న లేపాక్షి నంది సంస్థను వదిలేసి బాఫ్ నా వెంచర్స్‌ను తెరపైకి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు.
గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జీవోనెం 55 విడుదలచేసి.. నోటు పుస్తకాల ఆర్డర్లను ప్రభుత్వ రంగ సంస్థ ఏపీటీపీసీకే ఇవ్వాలని ఆదేశించినట్లు గుర్తుచేశారు. ప్రస్తుత సీఎస్ ఆ జీవోను తుంగలో తొక్కి.. 100కోట్ల విలువైన టెండర్‌ను లేపాక్షి నంది సంస్థను కాదని బయట కంపెనీకి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. హైకోర్టు స్టేటస్ కోను పట్టించుకోకుండా ఈ విధంగా చేయాల్సిన అవసరం ఏమిటో సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టెక్స్ట్ పుస్తకాల ముద్రణ ఏపీ ప్రభుత్వ ప్రెస్లోనే జరగాలని జీవో నెం 12 ద్వారా నిబంధన విధించిన ప్రభుత్వం.. నోటు పుస్తకాల విషయంలో ఎందుకు ప్రైవేట్ కంపెనీవైపు మొగ్గుచూపిందని నిలదీశారు.
ఇదీ చదవండి: