ETV Bharat / city

Pattabhi: వారితో మాట్లాడేందుకే జగన్ లండన్ వెళ్లారు: పట్టాభి - జగన్ తాజా వార్తలు

Pattabhi On Jagan Davos Tour: సీఎం జగన్ తన ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టుకునేందుకే లండన్ వెళ్లారంటూ.. తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపించారు. నిమ్మగడ్డ ప్రసాద్​ కేసు అంశంలో.. రస్-అల్-ఖైమా ప్రతినిధులతో మాట్లాడేందుకు జగన్ లండన్ వెళ్లారన్నారు.

పట్టాభి
పట్టాభి
author img

By

Published : May 22, 2022, 3:13 PM IST

వారితో మాట్లాడేందుకే జగన్ లండన్ వెళ్లారు

Pattabhi On Jagan: ముఖ్యమంత్రి జగన్ తన ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టుకునేందుకే దావోస్ ముసుగులో లండన్ వెళ్లారంటూ.. తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపించారు. ముందస్తు ఎన్నికల ప్రచారం జరుగుతున్న వేళ... అక్రమంగా కూడబెట్టిన డబ్బు కోసం వెళ్లారన్నారు. ఇస్తాంబుల్​లో ఆలస్యం వల్లే లండన్ వెళ్లాల్సి వచ్చిందన్న వైకాపా వివరణ అసత్యమంటూ.. సాక్ష్యాలతో సహా వివరించారు. నిమ్మగడ్డ ప్రసాద్​ కేసు అంశంలో.. రస్-అల్-ఖైమా ప్రతినిధులతో మాట్లాడేందుకు జగన్ లండన్ వెళ్లారన్నారు.

విలాసాలకు అలవాటు పడిన జగన్.. తన విలాసాల కోసం ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని పట్టాభి మండిపడ్డారు. దావోస్ వెళ్లటానికి గంటకు రూ.13 లక్షల వ్యయంతో అత్యంత ఖరీదైన ఎంబ్రాయిర్ లీనియజ్ 1000 అనే ప్రైవేటు విమానాన్ని జగన్ బుక్ చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‎దావోస్ పర్యటనకు విమానానికే రూ.9 కోట్ల ప్రజాధనం దుబారా చేశారని దుయ్యబట్టారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.