PATTABHI ON SKILL DEVELOPMENT FUNDS: స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో సీఐడీ చెప్పిన రూ.241 కోట్ల నిధులు అన్యాక్రాంతం కావడం పూర్తిగా అవాస్తవమని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. ఆ సొమ్మంతా కొన్ని డమ్మీ కంపెనీలకు వెళ్లి, మళ్లీ తిరిగి డైజన్ టెక్ కంపెనీకే వచ్చినట్లు సీఐడీ తననివేదికలో తెలిపిందని అన్నారు. కేంద్ర జీఎస్టీ సంస్థ డీజీజీఐ పూణె వారు.. డిజైన్ టెక్ కంపెనీ డబ్బులు మింగేసిందని ఎక్కడా చెప్పలేదని పట్టాభి చెప్పారు.
్ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుకు, డిజైన్ టెక్ కంపెనీ పన్నుఎగవేయడానికి ఏం సంబంధమో సీఐడీ చెప్పాలని పట్టాభి డిమాండ్ చేశారు. సిమెన్స్ సంస్థ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుకి సంబంధించి ఎలాంటి పరికరాలు, ఉపకరణాలు, వస్తువులు, ఇతర సాఫ్ట్ వేర్ సప్లైచేయలేదని సీఐడీ ఎలా చెబుతుందని ప్రశ్నించారు.
ప్రాజెక్ట్ మానిటరింగ్ కు గత ప్రభుత్వం కమిటీ వేస్తే, అది వేయలేదని కూడా సీఐడీ చెబుతోందన్నారు. ఇవేవీ గమనించకుండా సీఐడీ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు వ్యవహారంలో తాడేపల్లి పెద్దలు ఆడమన్నట్లు ఆడుతోందని పట్టాభిరామ్ ఆక్షేపించారు.
ఇదీ చదవండి:
Bank Employees Strike : రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల నిరసన