పరిహారం చెల్లించాల్సి వస్తుందనే.. కొవిడ్ మరణాలను ప్రభుత్వం చెప్పట్లేదని తెదేపా నేత పట్టాభి(pattabhi) ఆరోపించారు. 'ఏటా జనవరి నుంచి మే వరకు రాష్ట్రంలో నమోదయ్యే సగటు మరణాలతో పోల్చితే ఈ ఏడాది లక్షా 30 వేల మరణాలు అధికంగా నమోదయ్యాయి. ప్రతి ఏటా మే నెలలో సగటున 27వేల మంది మరణిస్తుంటే ఈ ఏడాది లక్షా 3వేల మంది చనిపోయినట్లు సీఆర్ఎస్ వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కరోనా వల్ల 2,937 మంది మాత్రమే కొవిడ్ (covid) వల్ల మరణించినట్లు అధికారిక లెక్కల్లో చూపింది. కొవిడ్ వల్ల పెద్ద సంఖ్యలో చనిపోయిన వారిని ఆర్థికంగా ఆదుకోవాల్సి వస్తుందనే మరణాల సంఖ్యను తొక్కిపెట్టడం సరికాదు. ప్రభుత్వ (andhrapradesh government) ఆదేశాల మేరకే కొవిడ్ మరణాలను సైతం సాధారణ, సహజ మరణాలుగా నమోదు చేశారన్నది స్పష్టమవుతోంది. వాస్తవాలను ఎందుకు తొక్కి పెట్టారో ముఖ్యమంత్రి జగన్ (cm jagan), వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని సమాధానం చెప్పాలి.' అని పట్టాభి అన్నారు.
కొవిడ్ వల్ల చనిపోయిన బాధితులకు ప్రభుత్వ పరంగా దక్కాల్సిన పరిహారం అందేలా చూడటం కోసం ఓ మిస్డ్ కాల్ క్యాంపైన్ ను అందుబాటులోకి తెచ్చాం. బాధితులు 8144 22 6661 నెంబర్ కు వివరాలు వెల్లడిస్తే వారికి న్యాయం జరిగే వరకూ పోరాడతాం. కొవిడ్ నివారణ, రికవరీ రేటు, వ్యాక్సిన్ పంపిణీ ఇలా అన్నిటిలోనూ ఆంధ్రప్రదేశ్ వెనకబడే ఉందని గణాంకాలు చెబుతున్నాయి. కొవిడ్ బాధితులకు అనేక రాష్ట్రాలు పరిహారం, ప్యాకేజీలు ప్రకటిస్తే ఏపీ రూపాయి సాయం కూడా చేయలేదు. ప్యాకేజీ లేదా పరిహారం తక్షణమే కొవిడ్ బాధిత కుటుంబాలకు ప్రకటించి వారిని ఆదుకోవాలి. - పట్టాభి, తెదేపా నేత
ఇదీ చదవండి:
జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై.. విచారణ జులై 1కి వాయిదా