జగన్ తాడేపల్లిలో ఉంటున్న ఇంటిస్థలం కూడా రాజధాని ప్రకటన తరువాతే కొన్నారని నిమ్మల రామానాయుడు గుర్తు చేశారు. అలా కొనడం నేరమైతే, జగన్ ని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ఉంటున్న తాడేపల్లి ఇల్లు రమేశ్ బాబు అనే వ్యక్తి పేరుతో ఉందని.. ఆయన జగన్ కు చెందిన 25 కంపెనీల్లో బినామీగా ఉన్నారని ఆరోపించారు. జగన్‌కు చెందిన సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్‌కు 1600 ఎకరాలు కట్టబెట్టడం ఇన్సైడ్ ట్రేడింగా.. లేక వన్ సైడ్ ట్రేడింగా అని నిలదీశారు.
108 వాహనాలపేరుతో రూ.300కోట్లు విజయసాయి రెడ్డికి కట్టబెట్టడం వన్ సైడ్ ట్రేడింగా? కాదా? అని నిమ్మల మండిపడ్డారు. మద్యం దుకాణాల ద్వారా 20 వేల కోట్లు కొట్టేస్తున్న జగన్, ఇన్ సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారా? లేక వన్ సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారా? అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: ఒక్కరోజులో 93,337 కరోనా కేసులు, 1247 మరణాలు