తెదేపా రాష్ట్రవ్యాప్త ఆందోళనకు ప్రభుత్వం దిగివచ్చి డిసెంబర్ 25న ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించిందని విజయవాడ పార్లమెంటరీ తెదేపా అధ్యక్షుడు నెట్టెం రఘురాం అన్నారు. ఐదు సంవత్సరాలలో 25 లక్షల ఇళ్లు ఇస్తామని వైకాపా మేనిఫెస్టోలో పెట్టిందని పేర్కొన్నారు. ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తైనా ఒక్క ఇల్లు కూడా పేదలకు ఇవ్వలేదని ఆరోపించారు. తెదేపా కోర్టుకు వెళ్లడం వల్లే ఇళ్ల స్థలాల పంపిణీ ఆగిపోయిందని తప్పుడు ఆరోపణలు చేశారన్నారు.
ఇళ్ల స్థలాల పంపిణీలో వైకాపా నేతలకు వాటాలు కుదరకపోవడం వల్లే...ఆ పార్టీ నేతలే కోర్టుకు వెళ్లారని రఘురాం ఆరోపించారు. పట్టణాలు, పల్లెల్లో సెంటు భూమిలో ఇళ్లు కట్టిస్తామని వైకాపా ప్రభుత్వం చెబుతోందని... అది ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రతి కుటుంబానికి రెండు సెంట్ల స్థలం ఇవ్వాలని రఘురాం డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : 'వైకాపా.. అవినీతికి కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తోంది'