జాబ్ క్యాలెండర్(JOB CALENDER) రగడపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్(LOKESH) నిరుద్యోగ, యువజన, విద్యార్థి సంఘాలతో నేడు సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11గంటలకు వర్చువల్‌గా జరిగే ఈ భేటీలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్ రద్దుచేసి, వైకాపా మేనిఫెస్టోలో పెట్టిన 2 లక్షల 30 వేల ఉద్యోగాలతో కొత్తగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా యువజన సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.
లక్షల ఉద్యోగాలిస్తామని..
లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి, వందల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇచ్చి మోసం చేశారని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పోరాటానికి తెలుగుదేశం మద్దతు ప్రకటించడంతో పాటు అనుబంధ సంఘాలైన.. తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ (TNSF)లు నిరసన కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నాయి. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేలా తీసుకోవాల్సిన చర్యలపై నేటి భేటీలో చర్చించి నిర్ణయించననున్నారు.
ఇదీ చదవండి: