తిరుమల కొండపై గోవిందనామాలకు బదులు జగన్ నామస్మరణ చేయటం మహా అపరాధమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకశ్ ధ్వజమెత్తారు. సీఎం జగన్ రెడ్డిని రక్షించే గోవిందుడు అంటూ తితిదే ఛైర్మన్ సతీమణి అనడం స్వామి వారికి తీరని కళంకమంటూ ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు తితిదే ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డికి ఏడు కొండలవాడి సేవ చేసే అవకాశం దొరికితే.. ఆ స్వామికే అపచారం తలపెట్టే పనులు మంచిది కాదని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ రెడ్డి ఫోటోను ఇళ్లల్లో పెట్టి పూజించుకుంటూ దేవుడిగా కొలుచుకుని వీలైతే పాదపూజ కూడా చేసుకోండంటూ ఆక్షేపించారు. నిజంగా ముఖ్యమంత్రికి దైవభక్తి ఉంటే ఆయనతో పాటు సతీమణి ఎందుకు రాదని సూటిగా ప్రశ్నించారు. వేదపండితులు తలపై వేసిన అక్షతలను అసహ్యంగా దులుపుకోవడం, ప్రసాదం వాసన చూడటం.. వంటి చర్యలతో స్వామిపై సీఎం జగన్‌కు దొంగ దైవభక్తి ఎందుకంటూ మండిపడ్డారు.
-
మీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు ఏడుకొండలవాడి సేవచేసే అవకాశం దొరికితే...ఆ స్వామికే అపచారం తలపెట్టే పనులు మంచిది కాదు టీటీడీ చైర్మన్ @yvsubbareddymp గారూ! ఓ బాబాయ్‌కి గొడ్డలిపోటు కానుకగా ఇచ్చి, బాబాయ్ కోటాలో మిమ్మల్ని..(1/4) pic.twitter.com/s4Q4brKONP
— Lokesh Nara (@naralokesh) October 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">మీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు ఏడుకొండలవాడి సేవచేసే అవకాశం దొరికితే...ఆ స్వామికే అపచారం తలపెట్టే పనులు మంచిది కాదు టీటీడీ చైర్మన్ @yvsubbareddymp గారూ! ఓ బాబాయ్‌కి గొడ్డలిపోటు కానుకగా ఇచ్చి, బాబాయ్ కోటాలో మిమ్మల్ని..(1/4) pic.twitter.com/s4Q4brKONP
— Lokesh Nara (@naralokesh) October 13, 2021మీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు ఏడుకొండలవాడి సేవచేసే అవకాశం దొరికితే...ఆ స్వామికే అపచారం తలపెట్టే పనులు మంచిది కాదు టీటీడీ చైర్మన్ @yvsubbareddymp గారూ! ఓ బాబాయ్‌కి గొడ్డలిపోటు కానుకగా ఇచ్చి, బాబాయ్ కోటాలో మిమ్మల్ని..(1/4) pic.twitter.com/s4Q4brKONP
— Lokesh Nara (@naralokesh) October 13, 2021
ఇదీ చదవండి:
Cyber crime: సైబర్ మోసాలకూ స్పెషల్ కోచింగ్ సెంటర్లు.. పట్టణాల్లో బహిరంగంగానే..