జగన్మోహన్రెడ్డి అరాచక, ఫ్యాక్షన్ పాలనకు ప్రతిపక్షనేతలపై పెడుతున్న కేసులే రుజువని తెదేపా సీనియర్ నేత కూన రవికుమార్ ధ్వజమెత్తారు. ఆనందయ్య మందుని అమ్ముకోవాలని చూసిన ఎమ్మెల్యే కాకాణిని వదిలేసి, సోమిరెడ్డిపైకేసు పెడతారా అని నిలదీశారు. మందును ఆన్ లైన్లో అందిస్తామన్న వెబ్ సైట్ నిర్వాహకులను ఎందుకు అరెస్ట్ చేయలేదని కూన ప్రశ్నించారు. ఆనందయ్య మందుతో ప్రభుత్వానికి - కాకాణి గోవర్థన్ రెడ్డికి సంబంధమేమేంటన్న కూన.. మందుకోసం ప్రభుత్వం రూపాయైనా ఖర్చుపెట్టిందా అని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే సోమిరెడ్డిపై పెట్టిన కేసును వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: కరోనా కట్టడికి విపక్ష నేతల సూచనలు ఎందుకు తీసుకోలేదు?: సోము వీర్రాజు