16 నెలల వైకాపా పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాల కన్నా.. ప్రతిపక్ష నేతలపై పెట్టిన అక్రమ కేసులే అధికంగా ఉన్నాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు. అచ్చెన్నాయుడికి, జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా సోకడానికి ప్రభుత్వ నిర్లక్ష్యం, కక్షపూరిత వైఖరే కారణమని ఆరోపించారు. వారికేమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. వైకాపా ప్రభుత్వం కొవిడ్‌ను కూడా కక్షసాధింపు చర్యలకు వాడుకుంటోందని మండిపడ్డారు.
సీఎం జగన్ పాలనలో ప్రతిపక్ష నేతలపై జరిగినన్ని దాడులు ఆదిమానవుని కాలంలో కూడా జరిగి ఉండవన్నారు. జగన్‌లో ఫ్యాక్షన్ పద్ధతి మారింది తప్ప.. ఆయన ఫ్యాక్షన్ మనస్తత్వం మారలేదని తీవ్రంగా విమర్శించారు. గతంలో భౌతికంగా దాడులు చేసేవారని.. ఇప్పుడు తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో మనసికంగా హింసింస్తున్నారన్నారు. కరోనాను, ఫోన్ ట్యాపింగ్‌ను రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్న ఏకైక ప్రభుత్వంగా వైకాపా నిలిచిపోతుందని చెప్పారు.
ఇవీ చదవండి..
పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ