సులభతర వాణిజ్యానికి సంబంధించి ఏపీ తొలిస్థానంలో ఉందని చెబతున్న జగన్, అది ఎవరి వల్ల వచ్చిందో ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. ఈజీ మనీకి అలవాటు పడ్డ జగన్‌కు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే తెలుస్తుందా? అని నిలదీశారు. జగన్ టార్చర్‌కు పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావడానికి భయపడుతున్నారని జవహర్ దుయ్యబట్టారు. కియా మోటార్స్, హీరో, లులూ, ఆదానీ వంటి పరిశ్రమల యాజమాన్యాలను ఎలా బెదిరించారో చూశామన్నారు. పెట్టుబడిదారుల సదస్సు ఒక్కటి కూడా పెట్టకుండా రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ లో సూర్యచంద్రులు కూడా తన వల్లే వస్తున్నారని జగన్ చెప్పుకునేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌లా జగన్ కూడా నిజం గ్రహించి, చంద్రబాబు కృషిని గుర్తిస్తే మంచిదని జవహర్ హితవు పలికారు.
జగన్ వచ్చాక అంతా ధ్వంసం చేశారు
చంద్రబాబు నాయుడి కష్టం, తపన, కృషివల్లే వరుసగా నాలుగోసారి రాష్ట్రం సులభతర వాణిజ్యంలో అగ్రస్థానంలో నిలిచిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్రాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా మార్చడానికి సరళీకరణ వాణిజ్య విధానాలతో చంద్రబాబు అభివృద్ధి దిశగా నిచ్చెన వేస్తే, జగన్ వచ్చాక అంతా ధ్వంసం చేశారని మండిపడ్డారు. జగన్ సామర్థ్యం వల్లే రాష్ట్రానికి ర్యాంకు వచ్చి ఉంటే, 15నెలల్లో ఎన్ని పరిశ్రమలు, కంపెనీలు వచ్చాయో మంత్రులు చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలనే నిర్ణయంతో జగన్ తన ప్రాంత రైతాంగానికి తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: గాయకుడు ఎస్పీ బాలుకు కరోనా నెగిటివ్