కరోనా కష్టకాలంలో ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి పేద, సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని తెదేపా అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ విమర్శించారు. 'నేను విన్నాను-నేను ఉన్నానని' ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన జగన్‌కు పెరిగిన రేట్ల గురించి వినపడటం లేదా ప్రజల సమస్యలు కనపడటం లేదా అని ప్రశ్నించారు. కరోనా వల్ల ఉఫాధి లేక తినడానికి తిండిలేక ప్రజలు అల్లాడుతుంటే ధరలు పెంచుతారా అని మండిపడ్డారు.
"ధరలు పెరిగి ప్రజలు అల్లాడుతుంటే మంత్రులు ఏం చేస్తున్నారు? ఇంట్లో ఉండి బూతులు ప్రాక్టీస్ చేస్తున్నారా? 20 రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు సుమారు 10 రూపాయలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో లీటర్ పెట్రోల్‌పై రూ.30, లీటర్ డీజిల్‌పై రూ.25 ఆదాయం వస్తోంది. గతంలో 75 రూపాయలు పెట్రోల్ ఉంటే చంద్రబాబు రెండు రూపాయలు తగ్గించారు" అని గొట్టిపాటి వ్యాఖ్యానించారు. పెంచిన పెట్రోల్, డీజీల్ ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.