విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి గ్రామంలో రైతులతో కలిసి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆరుగాలం కష్టపడి పెళ్ళాం పుస్తెలు తాకట్టు పెట్టి పంటలు సాగు చేసే రైతుల బాధలు.. ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదని విమర్శించారు. మిల్లర్ల దయా దాక్షిణ్యాల మీద రైతును గాలికి వదిలేశారని ఆరోపించారు. నారుమళ్లకు నీళ్లు ఇచ్చే సమయంలో ఏ విధంగా సముద్రంలోకి నీళ్లు వదులుతారని ప్రశ్నించారు.
కేఆర్‌ఎంబీ ఆఫీసు తీసుకెళ్లి విశాఖలో పెట్టారని దేవినేని ఉమా మండిపడ్డారు. ఇది రైతు దగా ప్రభుత్వమని అన్నారు. ధాన్యం డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియదని దుయ్యబట్టారు. గతంలో తమ ప్రభుత్వం రైతుకు పెట్టుబడి కింద 3 లక్షలు ఇచ్చే వాళ్ళమని, ఇవాళ లక్షకు తీసుకువచ్చారని ఆగ్రహించారు. రైతులు ప్రకృతికి ఎదురెళ్లి పంటలు పండిస్తున్నారన్న దేవినేని ఉమా... వాళ్ళను ఎందుకు ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఇదీచదవండి: