ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టి మళ్లించేందుకు వైకాపా ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఇంటిని రౌండప్ చేసి గోడలు దూకి అచ్చెన్నాయుడిని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. శస్త్రచికిత్స జరిగిన 24 గంటల్లో ఆయన్ను 500 కిలోమీటర్లు వాహనంలో తిప్పడం దారుణమన్నారు. ఈ క్రమంలో అచ్చెన్నాయుడుకి రక్తస్రావమయ్యిందని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారో సీఎం జగన్ చెప్పాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.
సర్జరీ తర్వాత 500 కిలోమీటర్లు తిప్పారు: దేవినేని ఉమా - tdp leaders fires on atchannaidu arrest
వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. శాసనసభలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న అచ్చెన్నాయుడుని అనారోగ్యంతో ఉన్న సమయంలో అరెస్టు చేయడం దారుణమన్నారు. 500 కిలోమీటర్లు వాహనంలో తిప్పడం వల్ల ఆయనకు రక్తస్రావమయ్యిందని పేర్కొన్నారు.
అచ్చెన్నాయుడు అరెస్టును ఖండించిన దేవినేని ఉమా