కరోనా విజృంభిస్తున్నా ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడం లేదని...తెలుగుదేశం నేత నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. లాక్‌డౌన్ నిబంధనలను వైకాపా నేతలు పాటించడం లేదన్న చినరాజప్ప...వైరస్ వ్యాప్తికి వారు కూడా కారణమవుతున్నారని తెలిపారు. 16వేల కేసుల నివేదికలు ఇంకా విడుదల చేయాల్సి వుందన్న అయన త్వరగా ఫలితాలు వచ్చేలా చూడాలని కోరారు. కరోనా పరీక్షలు విస్తృతంగా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా...చేసిన టెస్ట్‌ల ఫలితాలు వెంటనే ఎందుకు బయటపెట్టడంలేదని ప్రశ్నించారు. కరోనా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పీపీఈ కిట్లు అందించాలని చినరాజప్ప డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి...వైకాపా ఎంపీ విజయసాయిపై నాగబాబు సెటైర్లు