ETV Bharat / city

'అవినీతిపరులకు కేంద్రంగా వైకాపా.. నేరస్తుల జాబితాలో నెం-1' - panchamarti anuradha

నేరస్తులు ప్రజా ప్రతినిధులుగా ఉన్నారనే అంశంపై ఏడీఆర్ అనే సంస్థ ఇచ్చిన నివేదికలో వైకాపా నేతల పేర్లు ముందున్నాయని తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆదివాసీల పట్ల ఐటీడీఏ అధికారి ప్రవర్తించిన తీరు అమానవీయమని ఆయన అన్నారు. బీసీల పట్ల వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవినీతిపరులకు కేంద్రంగా వైకాపా
అవినీతిపరులకు కేంద్రంగా వైకాపా
author img

By

Published : Aug 24, 2021, 7:56 PM IST

నేరస్తులు ప్రజా ప్రతినిధులుగా మారడంపై ఏడీఆర్ సంస్థ ఇచ్చిన నివేదికలో వైకాపా నేతలు ముందున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు చినరాజప్ప ఎద్దేవా చేశారు. దొంగచేతికి తాళాలిచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి అనే నేరస్తుడిని ప్రజలు ముఖ్యమంత్రిని చేశారని.. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని వైకాపా నేతలు కబ్జాలు, దోపిడీలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం అవినీతిలో తొలిస్థానంలో, అభివృద్ధిలో ఆఖరి స్థానంలో ఉందని విమర్శించారు. ముఖ్యమంత్రి చేస్తున్న నిర్వాకాలతో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కోర్టు బోనుల్లో నిలబడుతున్నారని అన్నారు. దొంగలు, అత్యాచారాలకు పాల్పడేవారు, కబ్జారాయుళ్లు, అవినీతిపరులకు వైకాపా కేంద్రంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోని నలుగురు మంత్రులు, నలుగురు ఎంపీలు, 18 మంది ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రభుత్వంలో నేరస్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడని ప్రజలు గమనించాలని నిమ్మకాయల చినరాజప్ప కోరారు.

ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ప్రవీణ్.. చర్చల పేరుతో మాజీ ఎమ్మెల్యేను, ఆదివాసీలను నేలపై కూర్చోబెట్టడాన్ని చినరాజప్ప ఖండించారు. ఐటీడీఏ.. ఆదివాసీలకు తల్లి లాంటిదని, కానీ ఈ మధ్యకాలంలో ఐటీడీఏ పట్ల ఆదివాసీలకు ఉండే విశ్వసనీయత సన్నగిల్లుతోందన్నారు. గిరిపుత్రుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఐటీడీఏలో జరుగుతున్న పరిణామాలకు వ్యతిరేకంగా ఆదివాసీలు ఉద్యమించే పరిణామాలు చోటు చేసుకోవడంపై మండిపడ్డారు. 45 ఏళ్ల ఐటీడీఏ చరిత్రలో మునపెన్నడూ ఇటువంటి పరిస్థితులు రాలేదన్నారు.

ఒక్క అవకాశం ఇస్తే బీసీలను నాశనం చేస్తా అన్నట్లు వైకాపా నేతల తీరుందని తెదేపా ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ విమర్శించారు. బీసీలకు ఏదో చేసినట్టు అధికార పార్టీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. బీసీల అభివృద్ధికి తెదేపా బాటలు వేస్తే అదే బీసీల వెన్నుముకను సీఎం జగన్ విరిచేశారన్నారు. వైకాపా ప్రభుత్వం బీసీ కార్పొరేషన్​కు చెందిన రూ. 18,266 వేల కోట్ల నిధులను దారి మళ్లించిందని అనూరాధ ఆరోపించారు. ముఖ్యమంత్రి తన చర్యలతో బీసీలను బిచ్చగాళ్లుగా మారుస్తున్నారన్నారు. బీసీల అభివృద్ధి కోసం తెదేపా అమలు చేసిన ఆదరణ పథకాన్ని నిలిపివేయడం.. బీసీ కార్పొరేషన్ నిధులు దారి మళ్లించడాన్ని ఆమె తప్పుపట్టారు.

ఇదీ చదవండి:

CM Jagan On Agrigold: ఆ సమస్య పరిష్కారమయ్యాక అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం: సీఎ జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.