విజయవాడ సీపీకి తెదేపా నేత బొండా ఉమ ఫిర్యాదు - విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు
విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావును తెదేపా నేత బొండా ఉమ కలిశారు. మాచర్లలో నిన్న వైకాపా నేతల దాడి వివరాలను సీపీకి బొండా వివరించారు. వైకాపా దాడిలో ధ్వంసమైన కారును సీపీ కార్యాలయానికి తీసుకొచ్చారు బొండా. వైకాపా నేతల దాడి దృష్ట్యా.. తనకు రక్షణ కల్పించాలని కోరారు.