ETV Bharat / city

టీకా పంపిణీలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: బీద రవిచంద్ర - టీకా వార్తలు

కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని తెదేపా సీనియర్​ లీడర్​ బీద రవిచంద్ర ఆరోపించారు. టీకాల కొనుగోలులో కావాలనే ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. టీకాల వృథాలో రాష్ట్రం ముందంజలో నిలవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

beeda ravichandra
తెదేపా సీనియర్ నేత బీదరవిచంద్ర
author img

By

Published : Jun 13, 2021, 4:18 PM IST

Updated : Jun 13, 2021, 5:15 PM IST

కరోనా కట్టడిలో సీఎం జగన్మోహన్​ రెడ్డి వైఫల్యం చెందారని తెదేపా సీనియర్ నేత బీద రవిచంద్ర ఆరోపించారు. టీకా పంపిణీలో వైకాపా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. కేంద్రానికి లేఖలు, గ్లోబల్ టెండర్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కోట్ల రూపాయలు వెచ్చించి పలు రాష్ట్రాలు వ్యాక్సిన్ కొనుగోలు చేశాయని, ఏపీ బడ్జెట్​లో వ్యాక్సిన్ కొనుగోలుకు నామమాత్రపు కేటాయింపులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీకా తయారీ కంపెనీలకు కులాన్ని అంటగట్టడం ముఖ్యమంత్రి జగన్​కే చెల్లిందని ధ్వజమెత్తారు. వ్యాక్సిన్ వృథాలో రాష్ట్రం దేశంలోనే ప్రథమస్థానంలో ఉందన్నారు. కేంద్రం నుంచి 65 లక్షల వ్యాక్సిన్ డోసులు రాగా.. మనం ఉపయోగించింది కేవలం 26 లక్షలు మాత్రమేనన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్య 16 శాతం లోపే ఉందని, ఇదే తీరు కొనసాగితే టీకా పంపిణీ కార్యక్రమం 2024 వరకు కొనసాగుతుందని మండిపడ్డారు.

ఇవీ చదవండి:

జనం వద్దకే టీకా... 5 గంటలపాటు నడిచి వెళ్లి...

తెలంగాణ సరిహద్దు వద్ద రద్దీ.. ఈ-పాస్‌ ఉంటేనే అనుమతి

Last Updated : Jun 13, 2021, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.