ETV Bharat / city

Atchannaidu letter to CM Jagan: సీఎం జగన్​కు అచ్చెన్న బహిరంగ లేఖ - తులను ఆదకోవాలంటూ సీఎం జగన్‌కు అచ్చెన్నాయుడు లేఖ

Atchannaidu letter to CM Jagan: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించి వారిని ఆదుకోవాలంటూ.. తెదేపా నేత అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాశారు.

TDP leader Atchannaidu wrote letter to cm jagan over crop damage due to sudden rains in state
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదోకోవాలి.. సీఎంకు అచ్చెన్న లేఖ
author img

By

Published : May 7, 2022, 9:37 AM IST

Updated : May 7, 2022, 11:04 AM IST

TDP leader Atchannaidu wrote letter to cm jagan over crop damage due to sudden rains in state
సీఎం జగన్​కు తెదేపా నేత అచ్చెన్నాయుడు లేఖ

Atchannaidu letter to CM Jagan: అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ.. తెదేపా నేత అచ్చెన్నాయుడు సీఎం జగన్‌కు లేఖ రాశారు. పలు ప్రాంతాల్లో చేతికొచ్చిన పంటలు సైతం దెబ్బతిన్నాయన్నారు. గత మూడేళ్లుగా తుఫాన్ల ధాటికి 50 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నడంతో.. రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని పేర్కొన్నారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని.. తడిసిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దాదాపు 20వేల కోట్ల పంట నష్టం జరగగా.. ప్రభుత్వం ఇచ్చిన పరిహారం 10 శాతం కూడా దాటలేదని అన్నారు.

మాటలకే పరిమితం.. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు మాటలకే పరిమితమైందని విమర్శించారు. గత మూడేళ్లలో 9 తుపాన్ల ధాటికి సుమారు 50 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని లేఖలో అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దాదాపు రూ.20వేల కోట్ల పంట నష్టం జరగ్గా.. ప్రభుత్వం ఇచ్చిన పరిహారం 10 శాతం కూడా దాటలేదని ఆరోపించారు. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించి అన్నివిధాలా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేఖలో అచ్చెన్న కోరారు.

ఇదీ చదవండి:

YSRCP: జిల్లా కేంద్రం ఇచ్చాం కదా?.. ఇలాగైతే ఎలా? !

'ఆరాధన' మూవీ.. ఇప్పటికీ ఆ రికార్డు ఎన్టీఆర్​, ఏఎన్​ఆర్​, చిరంజీవి ఖాతాలోనే..!

Last Updated : May 7, 2022, 11:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.