కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి దిగజారి బాధపడుతున్న జనంపై.. సీఎం జగన్(jagan) మరింత ధరా భారం మోపారని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు.. నిత్యావసరాల ధరలు ఆకాశనంటుతున్నాయని మండిపడ్డారు. పనులు లేక కూలీలు పస్తులుంటున్నా.. కనీసం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల భారం నుంచి ప్రజలకు ప్రభుత్వం ఊరట కల్పించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
సీఎం జగన్ కొత్తగా.. రాష్ట్రంలో జగనన్న ధరల పెంపు పథకం అమలు చేస్తున్నారని అనిత ఎద్దేవ చేశారు. నిత్యావసరాలు, ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపు.. ముఖ్యమంత్రి ఘనతలేనని మండిపడ్డారు. పథకాలపేరుతో ప్రతి కుటుంబంపై రూ.2.50లక్షల అప్పులు వేశారని, అమ్మఒడి పేరుతో నెలకు రూ.1200, వాహనమిత్ర పేరుతో నెలకు రూ.800ఇస్తూ, అంతకు నాలుగింతలు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: Case filed on Somireddy: కృష్ణపట్నం పోర్టు పీఎస్‌లో సోమిరెడ్డిపై కేసు!