ETV Bharat / city

'మహిళలపై దాడులు, అఘాయిత్యాల్లో సగం వాలంటీర్ల పనే' - మహిళా ముఖ్యమంత్రి ఎవరని తెదేపా అనిత డిమాండ్

రాష్ట్రంలో మహిళలపై జరిగిన దాడులు, అఘాయిత్యాల్లో సగం వాలంటీర్లు చేసినవే అని.. దిశ యాప్ డౌన్​లోడ్​ బాధ్యత వాలంటీర్లకు అప్పగించి ఆడబిడ్డలను ఇంకా బలిచేద్దాం అనుకుంటున్నారా..? అని తెదేపా మహిళా అధ్యక్షురాలు ప్రశ్నించారు. శిక్షణ పొందిన పోలీసులతో భద్రత కల్పించకుండా మహిళా మిత్రులకు పోలీసు దుస్తులు ఇవ్వడం వల్ల ఎం ఉపయోగమన్నారు.

disha app
దిశ యాప్
author img

By

Published : Jun 30, 2021, 9:22 PM IST

'రాష్ట్రానికి ఓ మహిళ.. ముఖ్యమంత్రిగా రానున్నారని ముఖ్యమంత్రి జగన్ మాటల ద్వారా స్పష్టమైంది. కాబోయే ఆ మహిళా ముఖ్యమంత్రి ఎవరు' అని తెదేపా మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. తాడేపల్లిలో ఆయనతోపాటు ఉంటున్నారా.. లేక హైదరాబాద్​లో ఉంటున్నారా అని మీడియా సమావేశంలో అన్నారు.

రాష్ట్రంలో మహిళలపై జరిగిన దాడులు, అఘాయిత్యాల్లో సగం సీఎం జగన్​ నియమించిన వాలంటీర్లు చేసినవే. ఇప్పుడు దిశ యాప్ డౌన్​లోడ్​ బాధ్యత వాలంటీర్లకు అప్పగించి ఆడబిడ్డలను ఇంకా బలిచేద్దాం అనుకుంటున్నారా. శిక్షణ పొందిన పోలీసులతో భద్రత కల్పించకుండా మహిళా మిత్రులకు పోలీసు దుస్తులు ఇవ్వడం వల్ల ఏం ఉపయోగం' అని అనిత మండిపడ్డారు.

కాపీ పేస్ట్ విధానాన్ని దిశా యాప్​గా చెప్పుకుంటున్నారని.. సాధన దీక్షను ఎమార్చడానికే ఫేక్ కార్యక్రమం నిర్వహించారని ఆరోపించారు. ఇకనైనా అభూత కల్పనలతో మహిళలను మోసం చేసే ప్రక్రియకు ముగింపు చెప్పకుంటే వారు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.

ఇదీ చదవండి..

Jagan Cabinet Decisions: విద్యార్థులకు ల్యాప్​టాప్​లు.. ఇళ్ల నిర్మాణాలకు భారీగా నిధులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.