Aluri Harikrishna: గొల్లపూడిలో తెదేపా నాయకుడు ఆలూరి హరికృష్ణ చౌదరి(చిన్నా)ను పోలీసులు అరెస్టు చేశారు. అర్ధరాత్రి చిన్నాను అరెస్టు చేసిన పోలీసులు.. వన్‌టౌన్ పీఎస్‌కు తరలించారు. ఏం కేసు నమోదు చేశారో చెప్పకుండా అరెస్టు చేశారని తెదేపా ఆరోపిస్తోంది. చిన్నా అరెస్టుపై తెదేపా నేత దేవినేని ఉమ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాత్రి నుంచి దేవినేని ఉమ వన్‌టౌన్ పోలీసుస్టేషన్ వద్దే ఉన్నారు. మరోవైపు పీఎస్‌కు మైలవరం నియోజకవర్గం కార్యకర్తలు చేరుకుంటున్నారు.
వైకాపా నేత కోమటి రామ్మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆలూరి చిన్నాపై 307, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. చిన్నా-రామ్మోహన్ మధ్య ఆర్థిక లావాదేవీలే కారణమని చెప్పారు. దేవినేని ఉమ అనుచరుడు కాబట్టే కేసు బనాయించారని తెదేపా ఆరోపిస్తోంది. కాసేపట్లో ఆలూరి హరికృష్ణను కోర్టులో హాజరుపరచనున్నారు. వేలిముద్రలు సేకరణ కోసం సూర్యారావుపేటలోని సి.సి.ఎస్. స్టేషన్‌కు తరలించారు.
ఇవీ చదవండి: