ETV Bharat / city

'రాష్ట్రంలోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలంటూ'.. తెదేపా ఆందోళనలు

రాష్ట్రంలోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం ఆందోళన చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం మాదిరిగా రాష్ట్రంలోనూ ధరలు తగ్గించాలని జగన్​ ప్రభుత్వానికి తెదేపా నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు తెదేపా నేతలు వినూత్న రీతిలో నిరసనలు వ్యక్తం చేశారు.

పెట్రోడీజిల్‌ ధరలు తగ్గించాలని టీడీపీ  ఆందోళనలు
TDP agitations over petrol price in ap
author img

By

Published : May 25, 2022, 8:07 PM IST

TDP demand to Reduce Petrol Price in AP: కేంద్రం మాదిరిగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వైకాపా ప్రభుత్వం తగ్గించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం ఆందోళన నిర్వహించింది. ప్రజలపై బాదుడు ఆపాలని డిమాండ్‌ చేసింది. గుంటూరులో పెట్రోల్ బంక్ వద్ద తెదేపా నేత నజీప్‌ అహ్మద్‌ నేతృత్వంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నెల్లూరులో తెదేపా నగర, గ్రామీణ ఇన్ ఛార్జీలు కోటంరెడ్డి, అబ్దుల్ అజీజ్​.. ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. పెట్రోల్ లేని ద్విచక్రవాహనాన్ని నెట్టుకుంటూ తిరిగి మురుగుకాలువలో పడేశారు.

అనకాపల్లి జిల్లా చోడవరంలో తెలుగు దేశం పార్టీ నాయకులు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ.. ద్విచక్ర వాహనాలతో ర్యాలీ తీశారు. అనంతపురంలో పెట్రోల్ బంకులో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెట్రోల్ ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని కళ్యాణదుర్గంలో వినూత్నంగా నిరసన చేపట్టారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా కృష్ణా జిల్లా నందిగామలో తెదేపా కౌన్సిలర్లు, నేతలతో కలిసి మాజీ మంత్రి దేవినేని ఉమ నిరసన ర్యాలీ చేపట్టారు. విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన నివాసం నుంచి బెంజ్ సర్కిల్ వరకు సైకిల్​పై ర్యాలీ నిర్వహించారు.

ఇదీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.