పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. వాటి ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7వ తేదీన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టాలని తెదేపా నిర్ణయించింది. తెదేపా(tdp) అధినేత చంద్రబాబు(chandrababu) అధ్యక్షతన ఆన్‌లైన్ సమావేశంలో ముఖ్యనేతలు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. ఇసుక మాఫియాతో పాటు కొండపల్లిలో గ్రావెల్, విశాఖలో బాక్సైట్ అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఇనుప ఖనిజం, నెల్లూరులో సిలికా ఖనిజం అక్రమ మైనింగ్ చేస్తూ అధికారపార్టీ నేతలు వేలకోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజా సంపద పరిరక్షణతో పాటు ఎస్సీ(SC), ఎస్టీ(ST) అట్రాసిటీ చట్టం దుర్వినియోగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు.
వైకాపా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది
విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యను పక్కదారి పట్టించేలా వైకాపా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని తెదేపా నేతలు ఆక్షేపించారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవటానికి జగన్ రెడ్డి అవినీతే కారణమని మండిపడ్డారు. అరాచక పాలనతో పెట్టుబడులు తరిమేసి, అమరావతిని ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవహారాల్లో పాటించాల్సిన రాజ్యాంగ నియమాలు ఉల్లంఘించి APSDC ద్వారా అప్పులు చేశారని విమర్శించారు. సొంత కంపెనీల్లో జగన్ రెడ్డి అక్రమంగా పెట్టుబడులు పెట్టించిన తరహాలోనే..ప్రభుత్వ అప్పుల్లో చట్ట ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఉపాధిహామీ పెండింగ్ బిల్లులు రెండేళ్లు దాటినా చెల్లించకపోవటం కోర్టు ధిక్కరణతో పాటు కేంద్ర నిబంధనలకు విరుద్ధమని తెలుగుదేశం నేతలు స్పష్టం చేశారు.
లబ్ధిదారుల సంఖ్య తగ్గిస్తూ మోసం చేస్తున్నారు
సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల సంఖ్య తగ్గిస్తూ చేస్తున్న మోసాన్ని.. ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. దారి మళ్లించిన రోడ్డు సెస్ నిధులు 1200కోట్లు తిరిగి ఇచ్చి వెంటనే దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు చేపట్టాలని సమావేశం తీర్మానించింది.
జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్దారెడ్డి మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు