ETV Bharat / city

చంద్రబాబుకు వచ్చే ఆదరణను చూసి ఓర్వలేకే.. : బుద్ధా వెంకన్న

TDP Buddha Venkanna on Mahanadu Arrangements: వైకాపా ప్రభుత్వం.. మహానాడుకు అన్ని రకాలుగా అడ్డంకులు సృష్టిస్తోందని తెలుగుదేశం నేతలు విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే మహానాడుకు.. ప్రయాణ ఏర్పాట్లకు సైతం ఆటంకాలు కలిగిస్తోందని తెదేపా నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు.

TDP Buddha Venkanna on Mahanadu arrangements
బుద్ధా వెంకన్న
author img

By

Published : May 25, 2022, 4:57 PM IST

జగన్​ లాంటి పిరికి ముఖ్యమంత్రిని తానెప్పుడూ చూడలేదని తెదేపా నేతలు బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా అన్నారు. ప్రజల నుంచి చంద్రబాబుకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేక మహానాడు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి జగన్​ అనేక కుట్రలు పన్నుతున్నారని నేతలు మండిపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెదేపా కార్యాలయంలో కార్యకర్తలతో మహానాడు సన్నాహక సమావేశం నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం.. మహానాడుకు అన్ని రకాలుగా అడ్డంకులు సృష్టిస్తోందని నేతలు విరుచుకుపడ్డారు.

అవసరమైతే పాదయాత్రగా: ఒంగోలులో ఈనెల 27, 28 తేదీల్లో జరగనున్న మహానాడుకు జనం రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే బస్సులు ఇవ్వద్దని ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. మహానాడుకు అవసరమైతే పాదయాత్రగా వెళతాం. అడ్డుకోడానికి యత్నిస్తే మాత్రం.. రాష్ట్రంలోని అన్ని రహదారులను దిగ్బంధిస్తాం. మహానాడు సభకు వెళ్లేవారిని ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకోం' అని నేతలు హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.