వచ్చే భోగిలో వైకాపా చెత్త పాలనను తగులబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత దుయ్యబట్టారు. వైకాపా చేతిలో మోసపోయిన ప్రజలకు పండగ ఎలా చేసుకోవాలో అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు. జగన్ మంత్రి పదవి ఇవ్వలేదన్న ఆక్రోశాన్ని రోజా చంద్రబాబుపై చూపిస్తోందని విమర్శించారు.
రైతులకు మద్దతు ధరలు లేక ఇబ్బందులు పడుతుంటే ఇష్టానుసారం మాట్లాడటానికి సిగ్గుగా లేదా? అని మండిపడ్డారు. పేదలకు సంక్రాంతి కానుక ఎందుకు ఇవ్వలేదో సీఎం జగన్ను అడిగే ధైర్యం రోజాకు ఉందా అని నిలదీశారు. చంద్రబాబును తిడితే మంత్రి పదవి వస్తుందనే భ్రమలో రోజా ఉందని అనిత విమర్శించారు.
ఇదీచదవండి: రైతన్నలకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా తెదేపా రైతు భోగి కార్యక్రమం