ETV Bharat / city

Taxes: 'అభ్యంతరాలు తెలిపేందుకు గడువు పెంచండి'

ప్రభుత్వం పెంచిన ఆస్తి పన్నుపై అభ్యంతరాలు తెలిపేందుకు మరో మూడు నెలల గడువు పెంచాలని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్​కు టాక్స్ పేయర్స్ అసోసియేషన్ లేఖ రాసింది. కొవిడ్ వల్ల సమాచారం సేకరించటానికి నగర ప్రజలకు సమస్య తలెత్తిందని ఓ ప్రకటనలో తెలిపింది. దీనిని దృష్టిలో ఉంచుకుని గడువు మరోసారి పొడిగించాలని పేర్కొంది.

Taxes
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్
author img

By

Published : Jul 3, 2021, 8:57 PM IST

రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆస్తి పన్నులపై విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్​పై అభ్యంతరాలు తెలిపేందుకు మరో మూడు నెలల గడువు పెంచాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ మున్సిపల్ కమిషనర్​కు లేఖ రాసింది. పన్ను పెంపుపై ఈ నెల 5 లోపు అభ్యంతరాలను తెలియజేసేందుకు సమయం ఇచ్చారని.. కానీ ప్రజలు ఎటువంటి అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలియజేయకపోవడం వల్ల మరోసారి తేదీని పొడిగించాలని ఓ ప్రకటనలో కోరింది. కొవిడ్ వల్ల సమాచారం సేకరించటానికి నగర ప్రజలకు సమస్య తలెత్తిందని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సాంబిరెడ్డి తెలిపారు. ఈ-మెయిల్, వార్డు సచివాలయాల ద్వారా వచ్చే అభ్యంతారలనూ స్వీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

ప్రాజెక్టుల వద్ద కాపలా కాయడానికి అదేమన్నా పాక్‌ సరిహద్దా?: నక్కా ఆనంద బాబు

బ్యాంకుకు వెళ్లే మహిళలే టార్గెట్.. సీసీ కెమెరా ఉన్నా పట్టించుకోడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.