వైఎస్సార్ 'తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్' సేవల్లో భాగంగా అధునాతన వసతులతో కూడిన 500 ఏసీ వాహనాలను నేడు ఉదయం 10.30కు విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి జెండా ఊపి ప్రారంభించనున్నారు. కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి.. ప్రసవం అనంతరం తిరిగి వారిని ఇళ్లకు చేర్చేందుకు ఈ వాహనాలు వాడనున్నారు. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా విశ్రాంతి సమయంలో తల్లి అవసరాల కోసం ఐదు వేల రూపాయలు అందించనున్నారు. ఏడాదికి సగటున నాలుగు లక్షల మందికి ఈ సౌకర్యం అందుబాటులోకి రానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవల కోసం టోల్‌ఫ్రీ నెంబర్ 102ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
మొత్తం 500 వాహనాల్లో శ్రీకాకుళం జిల్లాకు 23, విజయనగరం 33, విశాఖపట్నం 67, తూర్పు గోదావరి 62, పశ్చిమ గోదావరి 33, కృష్ణా 33, గుంటూరు 31, ప్రకాశం 24, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు 19, చిత్తూరు 52, కడప 23, కర్నూలు 64, అనంతపురం జిల్లాకు 36 కేటాయించారు.
ఇదీ చదవండి: భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ ట్రైబ్యునళ్లు : సీఎం జగన్