ఉత్తర ఆంధ్రప్రదేశ్ - దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపో స్పియరిక్ స్థాయిల వరకు విస్తరించింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.
తీరం వెంబడి గంటకు 55-65 కి.మీ వేగంతో గాలులు వీస్తుండటంతో.. జాలర్లు రేపటి వరకు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణశాఖ సూచించింది. నేడు, రేపు.. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రా, రాయలసీమలో.. ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు, పశిమ గోదావరి జిల్లాల్లో.. ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు.. కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలపింది.
ఇదీ చదవండి: