ETV Bharat / city

నేటి నుంచి ఏపీ వాసులకు ఈ-పాస్‌ తప్పనిసరి: తెలంగాణ పోలీసులు - telangana police about e pass news

Suryapeta police have made e-pass mandatory for AP residents from tomorrow

author img

By

Published : May 22, 2021, 9:47 PM IST

Updated : May 23, 2021, 1:26 AM IST

21:40 May 22

గుర్తింపు కార్డులు తప్పనిసరి

నేటి నుంచి తెలంగాణలోని సూర్యాపేట జిల్లా సరిహద్దులో ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు.  రాష్ట్రం నుంచి వచ్చేవారికి ఈ-పాసులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. అంబులెన్సులు, అత్యవసర వాహనాలకు ఈ-పాస్‌ నుంచి మినహాయింపునిస్తూ అత్యవసర వాహనాలకు గుర్తింపు కార్డులు తప్పనిసరి చేస్తున్నట్లు సూర్యపేట జిల్లా ఎస్పీ భాస్కరన్‌ స్పష్టం చేశారు. విచ్చలవిడిగా తిరుగుతున్న జనాన్ని అదుపు చేసేందుకే ఆంక్షలు విధిస్తున్నామన్నారు. 

లాక్‌డౌన్‌ సడలింపు వేళల్లోనూ ఈ-పాస్‌ తప్పనిసరి చేశామన్నారు. సూర్యాపేట జిల్లాలో 4 చెక్‌ పోస్ట్‌లకు గానూ 3 మూసివేస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ రహదారి మీదుగానే తెలంగాణలోకి రావాలని చెప్పారు. మఠంపల్లి, పులిచింతల, కోదాడ గ్రామీణ మండలం రామాపురం చెక్‌ పోస్టులు కాకుండా కోదాడ మీదుగానే ఏపీ వాహనాలకు అనుమతిస్తున్నట్లు ఎస్పీ వివరించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 19,981 కరోనా కేసులు, 118 మరణాలు

Last Updated : May 23, 2021, 1:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.