ETV Bharat / city

అమరరాజా బ్యాటరీస్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దు: సుప్రీంకోర్టు

Supreme Court: అమరరాజా బ్యాటరీస్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కంపెనీకి పీసీబీ ఇచ్చిన నోటీసులకు తదుపరి చర్యలపై సుప్రీం స్టే విధించింది. తదుపరి విచారణ వరకు స్టే కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

author img

By

Published : May 19, 2022, 10:21 PM IST

అమరరాజా బ్యాటరీస్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దు

అమరరాజా సంస్థకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అమరరాజా బ్యాటరీస్‌ సంస్థ వల్ల.. పరిసర ప్రాంతాలు కాలుష్యంతో నిండిపోయాయని..అందుకు సంస్థను మూసివేయాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఈ ఏడాది ఫిబ్రవరి 21, 23 తేదీల్లో ఇచ్చిన షోకాజ్‌ నోటీసులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అమరరాజా బ్యాటరీస్‌పై తదుపరి ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై చట్ట ప్రకారం ముందుకు వెళ్లవచ్చునని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అమరరాజా బ్యాటరీస్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ హిమా కోహ్లిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు స్టే విధించింది. అమరరాజా సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌కు సమాధానం చెప్పాలని.. ఏపీ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, ప్రధాన విద్యుత్ పంపిణీ కంపెనీకి ధర్మాసనం నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ పూర్తియ్యేవరకు స్టే కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇవీ చూడండి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.