ETV Bharat / city

sub committee on scope of boards: బోర్డుల పరిధి అమలుపై ఉపసంఘం

గెజిట్ నోటిఫికేషన్ అమలుకు సంబంధించి సమన్వయ కమిటీల స్థానంలో ఉమ్మడిగా ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని కృష్ణా, గోదావరి బోర్డులు నిర్ణయించాయి. అవసరమైన సమాచారాన్ని ఇస్తామన్న రెండు రాష్ట్రాలు... అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పాయి. కొన్ని ప్రాజెక్టుల డీపీఆర్​లను గోదావరి బోర్డుకు ఇచ్చిన తెలంగాణ మిగతా వాటిని కూడా ఇస్తామని తెలిపింది. రాష్ట్ర విభజన కంటే ముందు పూర్తైన, వరదజలాలపై ఆధారపడి నిర్మించిన ప్రాజెక్టులను కూడా అనుమతుల్లేని ప్రాజెక్టులుగా చూపడం సరికాదని, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఆంధ్రప్రదేశ్ తెలిపింది.

బోర్డుల పరిధి అమలుపై ఉపసంఘం
బోర్డుల పరిధి అమలుపై ఉపసంఘం
author img

By

Published : Sep 2, 2021, 3:15 AM IST

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధికి సంబంధించి కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై రెండు బోర్డులు సంయుక్త సమావేశాన్ని నిర్వహించాయి. హైదరాబాద్ జలసౌధ వేదికగా జరిగిన సమావేశంలో కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఛైర్మన్లు ఎంపీసింగ్, చంద్రశేఖర్ అయ్యర్, రెండు బోర్డుల సభ్యులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులు, ఈఎన్సీలు పాల్గొన్నారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు కోసం రెండు రాష్ట్రాలు సహకరించాలని కోరిన బోర్డులు... అవసరమైన సమాచారాన్ని వీలైనంత త్వరగా అందించాలని అన్నాయి. ప్రాజెక్టులు, పంపు హౌస్​ల్లోని ఉద్యోగులు, సిబ్బంది వివరాలను ఇవ్వాలని కోరాయి. నోటిఫికేషన్​కు సంబంధించి రెండు రాష్ట్రాలు తమ అభిప్రాయాలను చెప్పాయి. కొన్ని పాత ప్రాజెక్టులను కూడా అనుమతుల్లేని ప్రాజెక్టులుగా చూపారని... ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలిపాయి.

పూర్తి స్థాయి కార్యాచరణ అవసరం

గెజిట్ నోటిఫికేషన్ అమలు కోసం పూర్తి స్థాయి కార్యాచరణ అవసరమన్న తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్... నిర్వహణలో వచ్చే ఇతర సమస్యలను బోర్డులు ఎలా పరిష్కరిస్తాయని ప్రశ్నించారు. లారీల కొద్దీ సమాచారం అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఏపీ ఫిర్యాదులు చేయగానే వెంటనే తెలంగాణను వివరాలు అడగడం ఏ మేరకు సబబని అన్నారు. కొన్ని ప్రాజెక్టుల డీపీఆర్​లు గోదావరి బోర్డుకు ఇచ్చామన్న రజత్ కుమార్... మరికొన్నింటివి కూడా ఇస్తామని చెప్పారు. కందకుర్తి, గూడెం ఎత్తిపోతల సహా పది ప్రాజెక్టులు అవసరం లేదని చెప్పినట్లు తెలిపారు.

కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం..

గెజిట్ అమలుతో రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలు పరిష్కారం అవుతాయన్న ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు... అవసరమైన వివరాలు, సమాచారం ఇస్తామని తెలిపారు. ఏపీలో విభజన కంటే ముందే పూర్తైన ప్రాజెక్టులను అనుమతుల్లేని ప్రాజెక్టులుగా పేర్కొనడం సబబు కాదన్న ఆయన... ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్న ఏపీకి చెందిన 4, తెలంగాణకు చెందిన 2 ప్రాజెక్టులను ప్రత్యేకంగా పేర్కొన్నారని... వాటిని కూడా అనుమతుల్లేని ప్రాజెక్టులు అనడం సరికాదని అన్నారు. వెలిగోడు ప్రాజెక్టుకు సంబంధించి దొర్లిన ముద్రణా పొరపాటును కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

నోటిఫికేషన్ అమలు కార్యాచరణ కోసం రోడ్ మ్యాప్ తయారు చేసేందుకు వీలుగా రెండు బోర్డులకు సంబంధించి ఉమ్మడిగా ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గతంలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీల స్థానంలో చీఫ్ ఇంజనీర్ల స్థాయిలో ఉపసంఘం ఏర్పాటు కానుంది.

ఇదీ చదవండి: KRMB-GRMB: తెలంగాణ వాదనను కేఆర్ఎంబీ అంగీకరించలేదు: ఏపీ జలవనరుల శాఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.