ETV Bharat / city

FARMERS PROBLEMS : మంత్రులు నిర్ణయించిన ధరకే దిక్కు లేదా..? రైతుల ఆవేదన! - subabul

FARMERS PROBLEMS : రాష్ట్రంలో సుబాబుల్‌, యూకలిప్టస్‌ కర్ర కొనుగోలు చేసే వారే కరవయ్యారు. మద్దతు ధర ఊసే లేదు. దీంతో.. రైతులు వచ్చిన ధరకే కర్రను విక్రయించుకోవాల్సిన దుస్థితి. రెండున్నరేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా.. ప్రభుత్వం పరిష్కారం చూపడం లేదు. ప్రతిపక్షనేత హోదాలో రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తానంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీ.. ఇంతవరకు అమలు కాలేదు. దీంతో రైతు సంఘాలు పోరుబాటకు సిద్ధమయ్యాయి.

సుబాబుల్, యూకలిప్టస్ రైతుల ఇబ్బందులు
సుబాబుల్, యూకలిప్టస్ రైతుల ఇబ్బందులు
author img

By

Published : Dec 22, 2021, 7:30 PM IST

Updated : Dec 22, 2021, 7:55 PM IST

FARMERS PROBLEMS : నిర్ణయించిన ధరకు కాగిత పరిశ్రమల ద్వారా సుబాబుల్‌, యూకలిప్టస్‌ కర్రను కొనుగోలు చేయించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. 4 జిల్లాలో ఎక్కువగా సాగులో ఉన్న ఈ రెండు పంటలు.. సుమారు 3 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో సుబాబుల్‌ పండిస్తుంటే.. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో యూకలిప్టస్‌ అధికంగా వేశారు. ఈ కర్రకు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ధర నిర్ణయిస్తున్నారు. టన్ను సుబాబుల్‌ ధర 4 వేల200 రూపాయలు, యూకలిప్టస్‌ టన్ను ధర 4 వేల 400 రూపాయలకు కొనుగోలు చేయాలని గత ప్రభుత్వంలోని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. కానీ.. కాగిత పరిశ్రమలు మాత్రం ససేమిరా అంటున్నాయి.

నష్టాలతో ప్రత్యామ్నాయ పంటల వైపు..
సాగునీటి వసతి లేని భూముల్లో మాత్రమే సుబాబుల్‌, యూకలిప్టస్‌, సరుగుడు తోటలు సాగు చేస్తున్నారు. కాగితపు పరిశ్రమలు కూడా రైతులను సాగుకు ప్రోత్సహించాయి. తీరా కర్ర కొట్టే సమయానికి ధర తగ్గించి తీసుకుంటున్నాయి. యూకలిప్టస్‌ టన్ను 2 వేల 200 వందల రూపాయల చొప్పున కొన్నాళ్లు కొనుగోలు చేస్తున్నారు. సుబాబుల్‌ టన్ను 3 వేల 200 రూపాయలకు మించి కొనడం లేదు. ఏటా ధర పడిపోవడంతో కొందరు రైతులు తోటలు తొలగించేందుకు సిద్ధమవుతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సాగు నీటి వసతి మెరుగుపడడంతో ఈ ఏడాది ఖరీఫ్​లోనే సుమారు 30 వేల ఎకరాల వరకు సుబాబుల్‌ కొట్టేశారు. ప్రత్యామ్నాయంగా పత్తి, మిర్చి సాగు వైపు మళ్లారు. ఇతర పంటలకు కౌలుకు ఇచ్చినా ఎకరానికి పది వేల రూపాయలకు తక్కువ కాకుండా వస్తుందనే అభిప్రాయం రైతుల్లో ఉంది.

మధ్యవర్తుల ప్రోత్సాహంతో కొనుగోళ్లు..
FARMERS PROBLEMS : కాగితపు పరిశ్రమలు మధ్యవర్తులను ప్రోత్సహించి కర్ర కొనుగోళ్లు చేయిస్తుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండున్నరేళ్ల క్రితం మార్కెట్‌ యార్డు నిర్ణయించిన కేంద్రాల్లోనే ఆన్‌లైన్‌ విధానంలో కొనుగోలు చేయాలనే నిబంధన తెచ్చారు. అదీ అటెక్కించారు. జిల్లా స్థాయిలో సంయుక్త కలెక్టరు ఆధ్వర్యంలోని కమిటీ ఎప్పటికప్పుడు కొనుగోళ్లను పర్యవేక్షించాల్సి ఉన్నా.. ఎవరూ పట్టించుకోవడంలేదు. సీఎం జగన్‌ హామీ ఇచ్చినట్లుగా సుబాబుల్‌, జామాయిల్, సరుగుడు కర్రకు మద్దతు ధరలు అమలు చేయాలని కోరుతూ జనవరి 10వ తేదీన ముఖ్యమంత్రి విజ్ఞాపన కార్యక్రమం చేపట్టాలని అఖిలపక్ష రైతు సంఘాలు నిర్ణయించాయి. ఈ లోపు ప్రభుత్వం స్పందించకుంటే ప్రత్యక్ష ఆందోళన చేపడతామని హెచ్చరించాయి.

ఇవీచదవండి.

Last Updated : Dec 22, 2021, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.