ETV Bharat / city

DED Counselling: డీఎడ్‌-2020 కౌన్సెలింగ్.. గందరగోళంలో విద్యార్థులు - డీఎడ్‌-2020 కౌన్సెలింగ్​లో గందరగోళం

డీఎడ్‌ - 2020 కౌన్సెలింగ్‌లో అధికారుల వైఖరి విద్యార్థులు, తల్లిదండ్రుల్ని కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. సీట్లు కేటాయించిన తర్వాత కళాశాలను రద్దు చేయడంతో వాటిలో చేరిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కళాశాలలకు అనుమతులిచ్చే విభాగానికి, కౌన్సెలింగ్‌ చేసే వారి మధ్య సమన్వయం లేకపోవడంతో అభ్యర్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. విద్యార్ధుల్ని సర్దుబాటు చేయలేక ప్రభుత్వం మౌనం వహిస్తోంది.

ded counselling issue
డీఎడ్‌-2020 కౌన్సెలింగ్.. గందరగోళంలో విద్యార్థులు
author img

By

Published : Jul 5, 2021, 6:55 PM IST

డీఎడ్‌-2020 కౌన్సెలింగ్.. గందరగోళంలో విద్యార్థులు

డీఎడ్‌-2020 కౌన్సెలింగ్‌ గందరగోళంగా మారింది. మొదటి విడత సీట్ల కేటాయింపులో 412 కళాశాలలను చూపిన అధికారులు, విద్యార్థులు చేరిన తర్వాత 337 కళాశాలల అనుమతులు రద్దు చేశారు. ఒవైపు విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా సీట్లు కేటాయింపు పూర్తి చేయడం లేదు. ఏదైనా ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహణ, కౌన్సెలింగ్‌కు నెల, రెండు నెలలు సమయం పట్టడం సాధారణం. కానీ డీఈఈసెట్‌-2020 ఏడాది పూర్తైనా కొనసాగుతూనే ఉంది. గతేడాది జూన్‌లోనిర్వహించిన డీఈఈసెట్‌కి దాదాపు 11వేల మంది హాజరయ్యారు. వీరిలో 8వేల మంది వరకు అర్హత సాధించారు. వీరికి మొదటి విడత కౌన్సెలింగ్‌లో అర్హతల ప్రకారం 4 వేల వేలమందికి సీట్ల కేటాయించారు.

ఆగమ్యగోచరంగా విద్యార్థుల పరిస్థితి

మొదటి విడత కౌన్సెలింగ్‌ సమయంలో 14 ప్రభుత్వ, 412 ప్రైవేటు కళాశాలలను చూపారు. వీటిల్లో 36,730సీట్లు అందుబాటులో ఉన్నట్లు ఆన్‌లైన్‌లో పెట్టారు. విద్యార్థులు వారికి నచ్చిన విద్యా సంస్థలను ఎంచుకొని ప్రవేశాలు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నిరోజులకు 337 కళాశాలల అనుమతులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. వీటిల్లో చేరిన 1,700మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అనుమతులు రద్దయిన కళాశాలల్లో చేరిన వారిని 75కళాశాలలకు సర్దుబాటు చేయాల్సి ఉండగా.. సీట్లు సరిపోకపోవడంతో అధికారులు మౌనం వహిస్తున్నారు. రద్దైన వాటిల్లో తెలుగు మాధ్యమం విద్యార్థులను సర్దుబాటు చేసేందుకు సీట్లు అందుబాటులో ఉన్నా.. ఆంగ్ల మాధ్యమంలో సరిపడా సీట్లు లేవు.

వీరికి ప్రభుత్వ డైట్‌ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించాలంటే సీట్ల సంఖ్యను పెంచాలి. ఇందుకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అనుమతి అవసరం. అనుమతి కోసం పాఠశాల విద్యాశాఖ లేఖ రాసినా ఇంతవరకు సమాధానం రాలేదు. ఫలితంగా మొదటి వారిని సర్దుబాటు చేయలేక, రెండోవిడత కౌన్సెలింగ్‌ నిర్వహించకుండా వదిలేశారు.ప్రవేశాలు పొందిన విద్యార్థులకు తరగతులు జరగడం లేదు.

కౌన్సెలింగ్‌కు ముందే అన్ని పరిశీలించి కళాశాలల జాబితాను రూపొందించాల్సిన ఎస్​సీఈఆర్​టీ.. విద్యార్థులు చేరిన తర్వాత చర్యలు తీసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. రెండో విడత కౌన్సెలింగ్‌ను త్వరలో నిర్వహించనున్నట్లు వెబ్‌సైట్‌ సమచారం పెట్టినా.. దానిపైన సందిగ్ధత కొనసాగుతోంది. అదనపు సీట్లకు అనుమతులు వస్తే తప్ప ఈ కౌన్సెలింగ్‌ పూర్తికాని పరిస్థితి నెలకొంది.

ఇదీ చదవండి:

KUMBLE: 'స్పోర్ట్స్​ యూనివర్శిటీ పెడితే సహకరిస్తాను'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.