కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. విజయనగరం జిల్లా ఎస్. కోట మండలం గోజలం గ్రామానికి చెందిన పరమేష్ అనే విద్యార్థి.. నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాల హాస్టల్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని నూజివీడు ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: