ETV Bharat / city

'కార్మిక వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకోవాలి' - నవంబర్ 26న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె తాజా వార్తలు

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ఉద్యోగ, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబర్ 26న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్లు కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు తెలిపారు. కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్య్ర ఉద్యోగ ఫెడరేషన్లు సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు.

'నవంబర్ 26న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె'

author img

By

Published : Nov 18, 2020, 6:24 PM IST

నవంబర్ 26న కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర్య ఉద్యోగ ఫెడరేషన్లు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నాయని కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ఉద్యోగ, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. సమ్మెకు రైతు, కౌలురైతు, వ్యవసాయు ఇతర ప్రజా సంఘాలు మద్దతు ఇస్తున్నాయన్నారు.

కరోనాతో ఉపాధి కోల్పోయిన కుటుంబానికి నెలకు 7,500 చొప్పున ఐదు నెలలు నగదు ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంసంహరించుకోవాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ విరమించుకోవాలని.. కీలక రంగాల్లోకి విదేశీ పెట్టుబడులను అనుమతించరాదని చెప్పారు. భవన నిర్మాణ, ఆటో, ప్రైవేటు ట్రాన్స్ పోర్టు, హమాలీ తదితర అన్ని రంగాల అసంఘటిత రంగ కార్మికులకు ఉపాధి, భద్రతతో సమగ్ర చట్టం చేయాలని చెప్పారు.

ఇదీ చదవండి:

కుందావారిఖంద్రికలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.